Find Articles

అమరావతికి మరో కీలక ముందడుగు.. రైల్వే స్టేషన్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం

అమరావతికి మరో కీలక ముందడుగు.. రైల్వే స్టేషన్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం

హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా అమరావతిలో రైల్వే స్టేషన్ నిర్మించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. విజయవాడకు కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్టేషన్‌ను నిర్మించనున్నారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మొత్తం 760 కిలోమీటర్ల పొడవైన ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ఏపీలో దాచేపల్లి, గుంటూరు, నెల్లూరు మీదుగా సాగనుంది.

అయితే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో రైలు మార్గం అలైన్‌మెంట్‌పై స్పష్టత లేకపోవడంతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోంది.

ManaTV Team