Find Articles

పవన్ కల్యాణ్ ‘ఓజీ 2’ ..హీరోయిన్ గా పూజా హెగ్డే..?

పవన్ కల్యాణ్ ‘ఓజీ 2’ ..హీరోయిన్ గా పూజా హెగ్డే..?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు గత కొంతకాలంగా సరైన్ హిట్ లేక అవకాశాలు తగ్గాయి. అయితే తాజాగా ఈ అందాల భామ బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు టాక్ వినిపిస్తోంది.పవన్, దర్శకుడు సుజిత్ కాంబినేషన్లో వచ్చిన ‘ఓజీ’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘ఓజీ 2’ తెరకెక్కబోతుండగా.. ఈ సినిమాలో పూజా హెగ్డేను తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గతంలోనే పవన్, పూజా హెగ్డే కాంబినేషన్ సెట్ అవ్వాల్సింది కానీ… కానీ, డేట్స్ సమస్య కారణంగా ఆగిపోయింది. హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, క్రిష్ జాగర్లమూడి ప్రాజెక్ట్‌లలో మొదట పూజా పేరు వినిపించింది. కానీ వర్కవుట్ కాలేదు. ఒకవేళ ఇప్పుడు ‘ఓజీ 2’ లో బుట్టబొమ్మ నటిస్తున్నారనే వార్త నిజమైతే… వరుస ఫెయిల్యూర్స్‌తో సైలెంట్ అయిన పూజా హెగ్డేకు, ఈ మెగా ప్రాజెక్ట్ ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ లా మారబోతోంది.

ManaTV Team