
అమెరికాలో మన అమెరికా తెలుగు అసోసియేషన్ (MATA) ద్వితీయ మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. మహాసభలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు నిర్వాహకులు. మాటా వ్యవస్థాపకులు మరియు సలహాదారులు శ్రీనివాస్ , ప్రదీప్ శ్యామల , మాటా అధ్యక్షులు కిరణ్ దుద్దగి , కన్వెన్షన్ కన్వీనర్ శ్రీధర్ గుడాల , విజయ భాస్కర్ , ప్రవీణ్ గుడూరు మరియు మాటా సభ్యులందరూ కలిసి ఈ మహాసభ విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేశారని అన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతను ప్రతిబింబించిన ఈ మహాసభలు అమెరికాలోని తెలుగు సమాజానికి మరో చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచాయని వారు పేర్కొన్నారు.

