
భారీ అంచనాల నడుమ రాబోతున్న ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం రేపు (జులై 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసి ప్రచారాన్ని మొదలుపెట్టింది.
అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించగా.. నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటించారు. ఇదిలా ఉంచితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌తో పాటు ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రారంభమయ్యాయి.
అంతేకాదు ఈ సినిమాపై ‘బుక్‌మైషో’లో ఇప్పటికే లక్షకు పైగా ఆసక్తులు నమోదయ్యాయని, “రేపటి నుంచి తాండవం మొదలవుతుంది” అని చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రధాన పాత్రధారి భారీ దేహంతో, చుట్టూ నాగసర్పాలతో ఉన్న లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్దపీట వేస్తూ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

