
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘తక్షకుడు’. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. నటుడిగా తనకు సంతృప్తినిచ్చిన చిత్రాల్లో ఇదొకటని చెప్పారు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తర్వాత డైరెక్టర్ వినోద్ అనంతోజుతో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.
తెలుగు ఫోక్లోర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ అంధుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.. గ్రామస్థుల మరణాలకు కారణమైన వారిపై తన పెంపుడు కుక్కతో కలిసి ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిగా నటిస్తున్నారని సమాచారం. ఈ పాత్ర తనకు ఎంతో సవాల్‌గా అనిపించిందని, అదే సమయంలో ఎంతో ఇంట్రెస్టింగ్ కూడా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే లుక్ టెస్ట్ స్కెచ్‌లు, షూటింగ్ సమయంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘తక్షకుడు’ టీజర్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తక్షకుడు ప్రేక్షకులకు నచ్చుతుందని ఆనంద్ దేవరకొండ ఆశాభావం వ్యక్తం చేశారు.

