
అల్ఫారెట్టా, జార్జియా: అమెరికాలోని భారతీయ సమాజానికి ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో AIWF (ATLANTA INDIAN WOMEN’S FORUM) మరియు GAPI (GEORGIA ASSOCIATION OF PHYSICIANS OF INDIAN HERITAGE) సంయుక్తంగా జూలై 18, 2026 (శనివారం) న DeSana Middle School, Alpharetta, Georgia లో మెగా హెల్త్ ఫెయిర్ 2026 నిర్వహిస్తున్నాయి.
ఈ కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమంలో ప్రజలకు ఉచిత వైద్యుల సంప్రదింపులు, ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలు, వెల్‌నెస్ అవగాహన కార్యక్రమాలు, ఫిట్‌నెస్ యాక్టివిటీలు, అలాగే రక్తదాన శిబిరం వంటి సేవలను ఎటువంటి రుసుము లేకుండా అందించనున్నారు.
ఈ మెగా హెల్త్ ఫెయిర్‌కు ఇప్పటికే విశేష స్పందన లభించింది. ఇప్పటివరకు 225 మందికి పైగా నమోదు చేసుకోగా, 420 వైద్యుల కన్సల్టేషన్ సెషన్లు, 120 ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, 195 అధునాతన పరీక్షలు, అలాగే 25 మంది రక్తదానానికి నమోదు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సేవలందించేందుకు ఇప్పటికే ముందుకు వచ్చిన వైద్యులు, ఆరోగ్య నిపుణులకు నిర్వాహకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి తిరిగి సేవ చేయాలనే వారి అంకితభావం ఆరోగ్య రంగానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అలాగే మరింత మంది వైద్యులు, ఆరోగ్య నిపుణులు, స్పాన్సర్లు, కమ్యూనిటీ భాగస్వాములు ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని AIWF, GAPI సంయుక్తంగా పిలుపునిచ్చాయి. వారి సహకారంతో మరింత మందికి ఆరోగ్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్య అవగాహనను విస్తృత స్థాయిలో పెంపొందించవచ్చని తెలిపారు.
ప్రజలందరూ ఈ ఉచిత ఆరోగ్య శిబిరానికి హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా తమ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని నిర్వాహకులు కోరారు.
నమోదు కోసం: www.tinyurl.com/AIWF-HF
కార్యక్రమ వివరాలు:
తేదీ: జూలై 18, 2026 (శనివారం)
వేదిక: DeSana Middle School, Alpharetta, Georgia

