
టాలీవుడ్ యువ హీరో అఖిల్ ఎట్టకేలకు సాలిడ్ హిట్‌తో బాక్సాఫీస్ వద్ద గట్టి కంబ్యాక్ ఇచ్చారు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో దూసుకుపోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.
’లెనిన్’ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 16.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. “అఖిల్ 2.0 వచ్చేశాడు.. బాక్సాఫీస్ గట్టిగా విన్నది. మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గొప్పగా ఆదరిస్తారని మరోసారి నిరూపించారు” అంటూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది.
ఈ సినిమాలో అఖిల్ నటన, హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయని టాక్ వినిపిస్తుంది. థమన్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. అలాగే అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందనే టాక్ వినిపిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంతో “అయ్యగారు గట్టి కంబ్యాక్ ఇచ్చారు” అంటూ అక్కినేని అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

