
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో జూలై 17 నుంచి 19 వరకు షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న TTA Mega Convention 2026లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు “TTA Awards for Excellence” ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. సమాజ సేవ, వైద్యం, విజ్ఞానం, సాంకేతికత, జర్నలిజం, సాహిత్యం, యువత సాధనలు, సమాచార సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులను ఈ వేదికపై సత్కరించనున్నారు. ఈ అవార్డుల ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తుల సేవలను గుర్తించి గౌరవించడం టీటీఏ లక్ష్యంగా పేర్కొంది.
