
టాలీవుడ్ సీనియర్ నటులు శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. కామెడీ, ఎమోషన్, భక్తి అంశాల కలబోతగా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తుంది.
ఈ చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపించనుండగా, ఆయన భక్తుడిగా శ్రీకాంత్ నటిస్తున్నారు. ఒక మధ్యతరగతి వ్యక్తికి అనుకోకుండా సంపద వస్తే, అతని జీవితంలో ఎలాంటి మార్పులు, సవాళ్లు ఎదురయ్యాయనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారని తెలుస్తోంది. గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించిన శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ మళ్లీ తెరపై సందడి చేయనుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 17న థియేటర్లలో విడుదల కానుంది. సాయికార్తీక్ సంగీతం అందించగా, బాలు జె క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.

