
American Telugu Association ఆధ్వర్యంలో అమెరికాలోని Baltimore Convention Center లో జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు నిర్వహించనున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ లో తెలుగు సాహిత్యానికి విశిష్ట స్థానం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆటా సాహిత్య వేదిక కార్యక్రమాలను ప్రకటించారు.
ఆటా సాహిత్య విభాగం ప్రారంభోత్సవం
ఆగస్టు 2, 2026 ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు సాహిత్య వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ప్రముఖ సాహితీవేత్త డా. పోలవరపు శ్రీకులానంద ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కార్యక్రమానికి అధ్యక్షతను శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వహించగా, ప్రముఖ అవధాని డా. నందూరి రామమోహన్‌రావు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
మూడు రోజుల పాటు వివిధ సాహిత్య ప్రక్రియలకు చెందిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో: తెలంగాణ మరియు సంస్కృతి అంశాలపై చర్చలు .ఆమెరికా తెలుగు బాలల సృజనాత్మక వేదిక .
“రండి… ప్రపంచ వేదికపై తెలుగు వెలుగును మరింత ప్రకాశింపజేద్దాం” అనే సందేశంతో ATA సాహిత్య కమిటీ తెలుగు భాషా, సాహిత్య, సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను రూపొందించింది.
