
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘RAW NTR’ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. తారక్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు ఆ సంస్థకు లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు ఎన్టీఆర్ సేవా కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడి అవుతాయని ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ సందర్భంలోనే ‘RAW NTR’ సంస్థ ఎన్టీఆర్‌తో సంబంధం ఉన్నట్లు ప్రజల్లో భ్రమ కలిగించేలా వ్యవహరిస్తోందని ఎన్టీఆర్ ఆఫీస్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అనధికారిక సంస్థలు, వ్యక్తుల ద్వారా జరిగే ప్రచారాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని తెలిపింది. అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు ముగింపు పలుకుతారని ఆశిస్తున్నట్లు పేర్కొంది. డిజిటల్, సోషల్ మీడియా వేదికలు అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఎన్టీఆర్ కార్యాలయం నుంచి విడుదల చేసిన లేఖలో తెలిపింది.

