
తెలుగు సినీ దిగ్గజ దర్శకుల సందడికి సిద్ధమైన షార్లెట్
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 17 నుంచి 19 వరకు జరగనున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్‌కు ప్రముఖ సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ (RGV), సందీప్ రెడ్డి వంగా హాజరుకానున్నారు.
భారతీయ సినీ పరిశ్రమలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు దర్శకులు టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. సినీ రంగానికి సంబంధించిన అనుభవాలు, సృజనాత్మక ప్రయాణం, భవిష్యత్ ప్రాజెక్టులపై అభిమానులతో ముచ్చటించే అవకాశం ఉండనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలో సినీ ప్రముఖులు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార సదస్సులు, యువజన, మహిళా, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది తెలుగు ప్రజలు ఈ కన్వెన్షన్‌కు హాజరై తెలుగు సంస్కృతి వైభవాన్ని ఆస్వాదించనున్నారు.
