Find Articles

అమెరికాలో జూలై 19న శ్రీనివాస కళ్యాణం

అమెరికాలో జూలై 19న శ్రీనివాస కళ్యాణం

టీటీఏ మెగా కన్వెన్షన్‌లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ఆధ్వాత్మికతకు పెద్దపీట వేశారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 17 నుంచి 19 వరకు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) జరగనున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా జులై 19 ఉదయం 9 గంటల నుంచి శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వేద పండితులు హాజరై కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కళ్యాణంలో పాల్గొనే ఆసక్తి కల వారు టీటీఏ వెబ్సైట్‌లో ఉన్న ప్యాకేజీ వివరాలు చెక్ చేసుకుని రిజిస్టర్ చేయించుకోవచ్చు. తిరుపతి వెళ్లి స్వామి వారి కళ్యాణంలో పాల్గొనే అవకాశం లేక బాధపడుతున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు.

ManaTV Team