Find Articles

డల్లాస్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ అవుట్‌రీచ్‌ సమావేశం.. ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ

డల్లాస్‌లో వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ అవుట్‌రీచ్‌ సమావేశం.. ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ

అమెరికాలోని డల్లాస్ నగరంలో వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవుట్‌రీచ్‌ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ వింగ్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్కరణల గురించి ఆయన వివరించారు. అలాగే పార్టీ చేపడుతున్న డిజిటల్ కార్యక్రమాలను ప్రవాస భారతీయులకు పరిచయం చేస్తూ ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను ఆవిష్కరించారు. సమావేశంలో భాగంగా సూపర్ యాప్‌కు మద్దతుగా రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌పై పార్టీ అభిమానులు, కార్యకర్తలు సంతకాలు చేసి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.

సాంకేతికతను వినియోగించి ప్రజలు, పార్టీ శ్రేణులతో మరింత సమర్థవంతంగా అనుసంధానం కావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని ఆలూరు సాంబశివారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, అన్నప్పురెడ్డి శివ, తిరుమల్ రెడ్డి, కృష్ణా రెడ్డి కోడూరు, దర్గా నాగిరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ManaTV Team