Find Articles

మంత్రి కొండా సురేఖపై వేటు? ముగ్గురు బీసీ మహిళా నేతలకు కీలక పదవులు

మంత్రి కొండా సురేఖపై వేటు? ముగ్గురు బీసీ మహిళా నేతలకు కీలక పదవులు

మంత్రి కొండా సురేఖపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మధ్యాహ్నం వరకు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన అనంతరం ముగ్గురు బీసీ మహిళా నేతలకు కీలక పదవులు కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

చిన్నారెడ్డిపై చర్యల అనంతరం ఖాళీ కానున్న ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ పదవిని ఓ మహిళా నేతకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరో ఇద్దరు మహిళా నేతలకు కూడా కీలక పదవులు ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ఇప్పటికే ఈ ముగ్గురు నేతల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్‌ పరిశీలనకు పంపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ManaTV Team