ఆస్ట్రేలియాలో ఓపెన్ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్ ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల పోర్టల్‌లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు ఆ దేశ ప్రధాని ఆంథనీ అల్బనీస్ వెల్లడించారు.
ఈ ఘటన జూన్ 18న జరిగినట్లు, అయితే సెప్టెంబర్ 10న ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలిపారు. పరిశోధనలో భాగంగా ఏఐ ఏజెంట్ మెడికేర్ స్టాటిస్టిక్స్ రిపోర్టింగ్ సర్వీసెస్ పోర్టల్‌ను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
కొన్ని పబ్లిక్, నాన్-పబ్లిక్ ఫైళ్లను ఏఐ ఏజెంట్ యాక్సెస్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే వ్యక్తిగత ఆరోగ్య సమాచారం లీక్ కాలేదని ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఓపెన్ఏఐ వెల్లడించాయి.
ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఫోరెన్సిక్ దర్యాప్తును ప్రారంభించింది. దర్యాప్తులో ఏఐ ఏజెంట్ ఎలా పోర్టల్‌ను యాక్సెస్ చేసింది, ఎలాంటి డేటాను యాక్సెస్ చేసింది అనే అంశాలను పరిశీలిస్తున్నారు.