Find Articles

గాజా పునర్నిర్మాణానికి 2.45 బిలియన్ డాలర్ల ప్రణాళిక

గాజా పునర్నిర్మాణానికి 2.45 బిలియన్ డాలర్ల ప్రణాళిక

గాజాలో కాల్పుల విరమణ ప్రణాళిక అమలుకు ఆటంకాలు కొనసాగుతున్న వేళ.. పునర్నిర్మాణం, పరిపాలన ప్రారంభించేందుకు అమెరికా మద్దతుగల ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఆరు నెలల కార్యాచరణ కోసం 2.45 బిలియన్ డాలర్ల ప్రణాళికను ప్రతిపాదించింది.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌లో బోర్డు సమావేశమైంది. ఈ సందర్భంగా గాజా పునర్నిర్మాణానికి సంబంధించిన 66 ప్రాజెక్టుల బ్లూప్రింట్‌ను ఆవిష్కరించింది.

ఈ ప్రణాళికలో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన పలు కార్యక్రమాలు ఉన్నాయి.

గాజాలో దెబ్బతిన్న మౌలిక వసతుల పునర్నిర్మాణానికి 35.2 బిలియన్ డాలర్లు అవసరమని బోర్డు అంచనా వేసింది. అలాగే, తదుపరి పదేళ్లలో మరో 71.4 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని పేర్కొంది.

ManaTV Team