అమెరికా లేదా ఇజ్రాయెల్ మరోసారి దాడి చేస్తే మధ్యప్రాచ్య యుద్ధాన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్‌కు సలహాదారు యహ్యా రహీమ్ సఫావి హెచ్చరించారు.
పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి నుంచి ఎర్ర సముద్రం వరకు ఘర్షణల పరిధి ఇప్పటికే విస్తరించిందని, మరిన్ని దాడులు జరిగితే యుద్ధం హిందూ మహాసముద్రం వరకు, అంతకుమించి కూడా విస్తరించే అవకాశం ఉందని సఫావి పేర్కొన్నారు.
ఈ పరిణామం భారత్‌కు కూడా ప్రాధాన్యంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. హిందూ మహాసముద్రంలో ఘర్షణలు విస్తరిస్తే మధ్యప్రాచ్యం–భారత్ మధ్య సముద్ర రవాణా, ఇంధన సరఫరా మార్గాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నివేదించింది. అయితే ప్రస్తుతం భారత్‌పై ప్రత్యక్ష ప్రభావం ఎలా ఉంటుందన్నది అనిశ్చితంగానే ఉంది.