ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో నిస్సాన్ సంస్థ రెనాల్ట్‌తో కలిసి ‘పిక్సో’ (Pixo) పేరుతో చిన్న ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది.
ఈ ఎలక్ట్రిక్ కారులో 27.5 kWh బ్యాటరీని అందించారు. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 259 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే 50 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో కేవలం 28 నిమిషాల్లో 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు.
టెక్నాలజీ పరంగా కూడా పిక్సోలో పలు ఆధునిక ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో గూగుల్ జెమిని AIతో పాటు 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది. డ్రైవింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మార్చేలా ఈ ఫీచర్లను రూపొందించినట్లు తెలుస్తోంది.
నిస్సాన్ పిక్సో ఎలక్ట్రిక్ కారు 2027 ప్రారంభంలో యూరప్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. చిన్న పరిమాణం, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో ఈ కారు యూరప్ మార్కెట్లోకి రానుంది.