తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఓ సినీ నటిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర, అవమానకర పోస్టులు ప్రచురించిన ‘డిగ్టీవీ తెలుగు’ (పేరడీ) ఎక్స్ ఖాతాపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ పోస్టులు ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు, అలాగే సదరు నటి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్ నేత కైలాశ్ సజ్జన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివాదాస్పద పోస్టులను తొలగించడంతో పాటు, వాటికి సంబంధించిన ఐపీ లాగ్లను భద్రపరచాలని ఎక్స్ (X) సంస్థకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను అధికారులు చేపట్టినట్లు సమాచారం.