అక్టోబర్ 17న గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ వేడుకలు.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట
అమెరికాలోని గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (GATeS) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతను చాటిచెప్పేలా ఈ వేడుకలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమం అక్టోబర్ 17, 2026న శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుంది. జార్జియాలోని సువానీ పట్టణంలో ఉన్న రివర్వాచ్ మిడిల్ స్కూల్లో ఈ వేడుకలు జరగనున్నాయి.
ప్రత్యేక ఆకర్షణలు
ఈ వేడుకల్లో దుర్గమ్మ పల్లకీ సేవ, గౌరీ పూజ, కోలాటం వంటి సంప్రదాయ కార్యక్రమాలతో పాటు ఫుడ్ స్టాళ్లు, విక్రయ స్టాళ్లు, చిన్నారుల కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. బతుకమ్మ సంబరాల ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలోని తెలుగు ప్రజలకు, భావితరాలకు పరిచయం చేయనున్నారు.