Find Articles

వందేళ్ల తర్వాత తిరుప్పరంకుండ్రం కొండపై మహాద్భుత ఘట్టం.. వెలిగిన కార్తీక దీపం

వందేళ్ల తర్వాత తిరుప్పరంకుండ్రం కొండపై మహాద్భుత ఘట్టం.. వెలిగిన కార్తీక దీపం

తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు కార్తీక దీపం వెలిగింది. సుమారు వందేళ్ల తర్వాత కొండపై ఉన్న దీపత్తూన్ వద్ద దీపం వెలగడంతో ఈ ఘట్టం చారిత్రాత్మకంగా నిలిచింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకు దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా కొండ ప్రాంతంలో కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలను (CRPF) భారీగా మోహరించారు.

దీపం వెలిగించే అద్భుత ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో భాగంగా కోర్టు నియమించిన మాజీ న్యాయమూర్తులు, ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

దీంతో తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించాలన్న భక్తుల ఆకాంక్ష నెరవేరింది.

ManaTV Team