అమెరికాలోని వర్జీనియాలో యునైటెడ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆఫ్ వర్జీనియా (UTCFVA) ఆధ్వర్యంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు, తెలుగు క్రైస్తవ కుటుంబాలు, స్థానిక కమ్యూనిటీ ప్రజలను నిర్వాహకులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
డిసెంబర్ 5, 2026, శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. వర్జీనియాలోని ఆష్‌బర్న్‌లో ఉన్న అవర్ సేవియర్స్ వే లూథరన్ చర్చిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణలు:
- క్రిస్మస్ కరోల్స్
- క్రిస్మస్ ఆటలు, వినోద కార్యక్రమాలు
- ప్రత్యేక క్రిస్మస్ సందేశం
- చిన్నారులకు బహుమతులు
- శాంటా క్లాజ్‌తో ఫోటోలు
- ప్రత్యేక విందు
ఆశ, శాంతి, ఆనందం, ప్రేమ అనే క్రిస్మస్ సందేశాన్ని చాటిచెప్పేలా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి ఆనందంగా క్రిస్మస్ సంబరాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.