హైదరాబాద్లోని ఐదు ఫెర్టిలిటీ సెంటర్లలో అక్రమంగా అండాలు సేకరిస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఐదు కేంద్రాలకు నోటీసులు జారీ చేసింది.
నోటీసులు అందుకున్న కేంద్రాల్లో ఇందిరా IVF, నర్మద, ఓయాసిస్, సద్గురు ART, పద్మజ ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం బుద్ధ భవన్లోని మహిళా కమిషన్ కార్యాలయంలో ఆయా కేంద్రాల మేనేజింగ్ డైరెక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్లు, కేంద్రాల హెడ్లు విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంబంధిత వివరాలు, ఆధారాలను కమిషన్ పరిశీలించింది. విచారణలో లభించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలపై మహిళా కమిషన్ నిర్ణయం తీసుకోనుంది.