జగిత్యాల జిల్లాలో బాలుడి దత్తత వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బాలుడి దత్తత ప్రక్రియ చట్టబద్ధతపై సందేహాలు వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు.
అక్టోబర్ 16న హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు బాలుడిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే తాజాగా కలెక్టర్ ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేశారు.
గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించాలని, బాలుడిని తిరిగి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ తన పిటిషన్‌లో కోరినట్లు సమాచారం.
బాలుడు పెంపుడు తల్లిదండ్రుల వద్ద ఉంటే ఈ వ్యవహారంపై జరుగుతున్న విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
కలెక్టర్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌తో ఈ కేసు మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.