ప్రొబెషనరీ డీఎస్పీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. పోలీస్ అధికారులు ఉద్యోగంలో చేరినప్పుడు ఎలాంటి శారీరక దృఢత్వంతో ఉన్నారో.. రిటైర్మెంట్ వరకు అదే ఫిట్‌నెస్‌ను కొనసాగించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అధికారుల బెల్ట్ ఎప్పుడూ టైట్‌గానే ఉండాలని, బెల్ట్ లూజ్ కాకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని సూచించారు. బెల్ట్ లూజ్ అయితే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదంటూ చమత్కరించారు.
ఈ ఫిట్‌నెస్ నిబంధన కేవలం పోలీసులకే కాకుండా రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి సర్వీస్ చివరి రోజు వరకు ప్రతి పోలీస్ అధికారి నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.