Find Articles

డెట్రాయిట్‌లో సాయి మందిరం కోసం భారీ నిధుల సేకరణ

డెట్రాయిట్‌లో సాయి మందిరం కోసం భారీ నిధుల సేకరణ

అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం, డెట్రాయిట్ సమీపంలోని లివోనియా సాయి మందిరం విస్తరణ పనులకు భారీ మద్దతు లభించింది. ఆలయ విస్తరణ కోసం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ భక్తిని, సేవాభావాన్ని చాటుకున్నారు.

సాయి మందిరం విస్తరణ కోసం నిర్వాహకులు 1.5 మిలియన్ డాలర్ల విరాళాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే భక్తులు, దాతల నుంచి అనూహ్య స్పందన రావడంతో లక్ష్యాన్ని మించి ఏకంగా 2 మిలియన్ డాలర్ల విరాళాలు సమకూరాయి. అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి భారీ మొత్తంలో విరాళాలు అందడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా నిర్వాహకుడు ప్రసాద్ బీసబత్తుని మాట్లాడుతూ.. సాయిబాబా ఆశీస్సులు, భక్తుల సహకారం వల్లే తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, అంచనాలకు మించి విరాళాలు సేకరించగలిగామని హర్షం వ్యక్తం చేశారు.

భక్తుల ఐక్యత, ప్రవాస భారతీయుల ఉదారతతో లివోనియా సాయి మందిరం విస్తరణకు మరింత బలం చేకూరింది.

ManaTV Team