Find Articles

స్వదేశానికి షేక్ హసీనా రాకపై ఉత్కంఠ.. బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు

స్వదేశానికి షేక్ హసీనా రాకపై ఉత్కంఠ.. బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించడంతో ఆ దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఆమె డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

హసీనా సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో అవామీ లీగ్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. కత్తులు, ఈటెలతో ఆందోళనలు చేపట్టడంతో పాటు పోలీసు వాహనాలకు నిప్పంటించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగా బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) బలగాలతో పాటు 1,350 మంది పోలీసులను మోహరించింది.

మరోవైపు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు పొందేందుకు షేక్ హసీనా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. డిసెంబర్‌లో ఆమె స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించిన నేపథ్యంలో భారత్ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

హసీనా తిరుగు ప్రయాణం, బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారాయి.

ManaTV Team