Find Articles

అట్లాంటాలో ఘనంగా మహా రుద్ర యాగం.. నవంబర్ 20 నుంచి 22 వరకు ఆధ్యాత్మిక వేడుకలు

అట్లాంటాలో ఘనంగా మహా రుద్ర యాగం.. నవంబర్ 20 నుంచి 22 వరకు ఆధ్యాత్మిక వేడుకలు

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఉన్న హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా ఆధ్వర్యంలో మహా రుద్ర యాగం నిర్వహించనున్నారు. నవంబర్ 20 నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక వేడుకలు జరగనున్నాయి.

ఈ కార్యక్రమాల్లో భాగంగా నవంబర్ 21వ తేదీ శనివారం ప్రత్యేక భక్తి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిరుమురై, శివతాండవ స్తోత్రం వంటి భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అనంతరం సాయంత్రం 5 గంటలకు నంది మండపం ఇండియనైజేషన్, సంప్రదాయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత ప్రదోషకాల అభిషేకం నిర్వహించనున్నారు.

ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని పరమశివుడు, నందీశ్వరుడి దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.

ManaTV Team