Find Articles

ఆస్ట్రేలియాలో ‘SPB Lives On’.. ఎస్పీ చరణ్‌తో పాటలు పాడే అవకాశం.. ఆడిషన్స్ ప్రారంభం

ఆస్ట్రేలియాలో ‘SPB Lives On’.. ఎస్పీ చరణ్‌తో పాటలు పాడే అవకాశం.. ఆడిషన్స్ ప్రారంభం

దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆయన పాటలతో సంగీత ప్రియులను అలరించేందుకు ఆస్ట్రేలియాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా (TAAI) ఆధ్వర్యంలో ‘పాడనా తీయగా – NRI Global: SPB Lives On’ పేరుతో సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు.

ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్పీ చరణ్‌తో కలిసి పాటలు పాడే అరుదైన అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం ఆడిషన్స్ ప్రారంభమయ్యాయి.

ఈ పోటీలను మూడు విభాగాలుగా నిర్వహించనున్నారు. 8 నుంచి 14 ఏళ్ల వయస్సు వారికి జూనియర్స్ విభాగం, 15 నుంచి 21 ఏళ్ల వారికి యూత్ విభాగం, 22 ఏళ్లు పైబడిన వారికి ఓపెన్ కేటగిరీలో పోటీలు ఉంటాయి.

ఈ కార్యక్రమానికి గ్రాండ్ ఫినాలే 2027 ఫిబ్రవరి 6వ తేదీ శనివారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెల్‌బోర్న్‌లోని ది బెసెన్ ఆర్ట్ సెంటర్, బర్వుడ్‌లో ఈ వేడుక జరగనుంది.

ఆసక్తి ఉన్న గాయనీగాయకులు taai.net.au/nriglobal వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా భాగస్వాములు కావాలనుకునే వారు డాక్టర్ శ్రీ గుళ్లపల్లి (+61 452 649 913), రామ్ కట్నేని (+61 433 242 731)లను సంప్రదించవచ్చు.

స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాన మాధుర్యాన్ని మరోసారి గుర్తుచేస్తూ, ప్రవాస భారతీయుల్లోని గాన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

ManaTV Team