దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ఆయన పాటలతో సంగీత ప్రియులను అలరించేందుకు ఆస్ట్రేలియాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా (TAAI) ఆధ్వర్యంలో ‘పాడనా తీయగా – NRI Global: SPB Lives On’ పేరుతో సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్పీ చరణ్‌తో కలిసి పాటలు పాడే అరుదైన అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం ఆడిషన్స్ ప్రారంభమయ్యాయి.
ఈ పోటీలను మూడు విభాగాలుగా నిర్వహించనున్నారు. 8 నుంచి 14 ఏళ్ల వయస్సు వారికి జూనియర్స్ విభాగం, 15 నుంచి 21 ఏళ్ల వారికి యూత్ విభాగం, 22 ఏళ్లు పైబడిన వారికి ఓపెన్ కేటగిరీలో పోటీలు ఉంటాయి.
ఈ కార్యక్రమానికి గ్రాండ్ ఫినాలే 2027 ఫిబ్రవరి 6వ తేదీ శనివారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెల్బోర్న్లోని ది బెసెన్ ఆర్ట్ సెంటర్, బర్వుడ్లో ఈ వేడుక జరగనుంది.
ఆసక్తి ఉన్న గాయనీగాయకులు taai.net.au/nriglobal వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా భాగస్వాములు కావాలనుకునే వారు డాక్టర్ శ్రీ గుళ్లపల్లి (+61 452 649 913), రామ్ కట్నేని (+61 433 242 731)లను సంప్రదించవచ్చు.
స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాన మాధుర్యాన్ని మరోసారి గుర్తుచేస్తూ, ప్రవాస భారతీయుల్లోని గాన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.