అమెరికాలోని హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో రెండో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
నవంబర్ 16వ తేదీ సోమవారం భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు మహాన్యాసం నిర్వహించనుండగా.. 6:30 గంటలకు భగవాన్ శ్రీ రామలింగేశ్వర స్వామివారికి విశేష అభిషేకం జరగనుంది.
ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని పరమశివుడి దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.
శివనామస్మరణ, ప్రత్యేక పూజలతో కార్తీక మాస ఆధ్యాత్మిక శోభను చాటేందుకు ఆలయంలో ఏర్పాట్లు చేశారు.