ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక సమాచారం. డిసెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొన్ని నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ సంస్థలు ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను సమీక్షించనున్నాయి. దీంతో వంటగ్యాస్ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఉజ్వల యోజన లబ్ధిదారులు సబ్సిడీ పొందాలంటే ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
అలాగే ఒక సిలిండర్ రీఫిల్ బుక్ చేసిన తర్వాత తదుపరి బుకింగ్‌కు 25 రోజుల గడువు నిబంధన కొనసాగుతుంది. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని డెలివరీ సిబ్బందికి అందించాల్సి ఉంటుంది.
ఇక పైపుల ద్వారా సహజ వాయువు (PNG) కనెక్షన్‌కు మారిన వినియోగదారులు 30 రోజుల్లో తమ పాత ఎల్‌పీజీ కనెక్షన్‌ను రద్దు చేసుకోవాలి.
కాబట్టి గ్యాస్ వినియోగదారులు ఈ నిబంధనలను గుర్తుంచుకుని, అవసరమైన ప్రక్రియలను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది.