ప్రముఖ స్టాండప్ కమెడియన్, కంటెంట్ క్రియేటర్ సమయ్ రైనా యూట్యూబ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. తన యూట్యూబ్ ఛానల్‌కు ఏకంగా 10 లక్షల మంది పెయిడ్ మెంబర్స్‌ను సంపాదించి ఈ ఘనత సాధించిన తొలి యూట్యూబర్‌గా నిలిచారు. ఈ రికార్డును యూట్యూబ్ సంస్థ అధికారికంగా ధృవీకరించినట్లు సమాచారం.
తొలుత చెస్‌కు సంబంధించిన వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న సమయ్ రైనా.. ఆ తర్వాత ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించారు.
గతేడాది ఈ షో చుట్టూ వివాదాలు చెలరేగడంతో కొంతకాలం విరామం తీసుకున్న ఆయన.. ఈ ఏడాది మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా 10 లక్షల మంది పెయిడ్ మెంబర్స్‌తో అరుదైన రికార్డు సాధించి మరోసారి వార్తల్లో నిలిచారు.