
స్టార్ నటి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతగా తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆమె తమిళ చిత్రం ‘ మగుడం’ తో పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అంజలి ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాలను పంచుకున్నారు.
ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన ఓ అబ్బాయికి రాఖీ కట్టి అన్నయ్యను చేసుకోబోయినట్లు చెప్పారు అంజలి. కానీ అతను వెంటనే దాన్ని తీసి తనకే తిరిగిచ్చాడని తన స్కూల్ నాటి ఓ సరదా సంఘటనను గుర్తుచేసుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలపై వస్తున్న పుకార్లతో విసిగిపోయానని చెప్పారు. ప్రస్తుతం తన తమిళ చిత్రం ‘మగుడం’ (తెలుగులో మకుటం) ప్రమోషన్లలో బిజీగా ఉన్నట్లు తెలిపారు.
కొంతకాలంగా పలువురు యాక్టర్స్ తో తనకు సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలపై అంజలి స్పందించారు. ఈ పుకార్లు తనను చాలా బాధించాయన్నారు. నేను ఒకరి పేరు చెబితే, మీరు మరొకరి గురించి అడుగుతారు. అందుకే ఎవరి పేరు చెప్పదల్చుకోలేదు. ప్రస్తుతం నా జీవితంలో ఎవరూ లేరంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో అంజలి ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై వస్తున్న వదంతులకు ఫుల్స్టాప్ పడింది.
