
కన్నడ స్టార్, జాతీయ అవార్డ్ విజేత రిషబ్ శెట్టి తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్స్ అందించారు. ‘కాంతార’ సినిమాతో సంచలన విజయం అందుకున్న ఈ నట దర్శకుడు.. ఈ ఫ్రాంచైజీలో రాబోయే తదుపరి భాగం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఖాళీగా కూర్చోలేనని, తన డైరెక్షన్ వర్క్ తాను చేసుకోకపోతే మనశ్శాంతి ఉండదని పేర్కొన్నారు. తన దర్శకత్వ బాధ్యతలు ఎంతో సంతోషాన్ని, ప్రశాంతతను ఇస్తాయని చెప్పారు. ప్రస్తుతం తన రైటర్స్ టీమ్‌తో కలిసి ‘కాంతార: చాప్టర్ 2’ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని తెలిపారు.
కేవలం ‘కాంతార’ మాత్రమే కాకుండా భవిష్యత్తులో తాను నటించబోయే రెండు క్రేజీ చిత్రాల గురించి కూడా రిషబ్ క్లారిటీ తెలిపారు. తనకు బ్యాక్ టు బ్యాక్ రెండు పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయని చెప్పారు. తాను ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ చేయలేనన్న రిషబ్.. అందుకే మొదట ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోయే ‘జై హనుమాన్’ సినిమా పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ తర్వాతే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు.

