టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన కొత్త సినిమా ‘లెనిన్’ తో ప్రేక్షకులను ఆలరించడానికి రాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. పూర్తిస్థాయి రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను విశాఖలో ఘనంగా జరిగింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ అదిరిపోయింది.
‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న మురళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక రాయలసీమ నేపథ్యంతో రాబోతున్న ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్రైలర్‌ను బట్టి ఇందులో మాస్ అంశాలతో పాటు బలమైన ప్రేమకథ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ‘లెనిన్’ చిత్రాన్ని జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, తాజాగా రిలీజైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండగా.. ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో మంచి విజయం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…