రాకింగ్ స్టార్ యశ్, గీతూ మోహన్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఆసక్తికరమైన గ్లింప్స్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది. కాగా ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
‘లేడీస్ & లేడీస్’ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియో, సినిమాలోని మహిళా పాత్రలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ వీడియో సినిమాలోని డార్క్, స్టైలిష్ ప్రపంచాన్ని ఆవిష్కరించిందని అర్ధం అవుతుండగా, హీరోయిన్ల లుక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరీ ముఖ్యంగా, “పిల్లలు దూరంగా ఉండండి.. తల్లిదండ్రులు మీ పిల్లలను దూరంగా ఉంచండి.. తాతయ్యలు, మీ మనవళ్లను దూరంగా ఉంచండి.. ముత్తాతలు, మీ సొంత రిస్క్‌తో చూడండి” అంటూ వీడియో మొదటిలోనే ఇచ్చిన హెచ్చరిక, సినిమా ఎంత బోల్డ్‌గా, వైల్డ్‌గా ఉండబోతుందో తెలియజేస్తుంది.
ఈ వీడియోలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి తమ ప్రజెన్స్‌తో ఆకట్టుకున్నారు. దీనికి తోడు వినిపించే లేడీ వాయిస్ ఓవర్ వీడియోకి మరింత మిస్టరీని యాడ్ చేసింది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…