టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లరి నరేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసిన ఈ హీరో.. ఇటీవల ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి సీరియస్, ఇంటెన్స్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా, మళ్లీ తన ట్రేడ్ మార్క్ కామెడీతో అలరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
అల్లరి నరేశ్ పుట్టినరోజు సందర్భంగా తన 65వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు ‘రంభ ఊర్వశి మేనక’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేసింది. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, ఫాంటసీ అంశాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. చంద్రమోహన్ చింతాడ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ పతాకాలపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…