
అమరావతి: అమరావతిలో Sunil Bharti Mittalతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధిపై కీలకంగా చర్చించారు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చివరి గ్రామం వరకు (లాస్ట్ మైల్) హైస్పీడ్ ఇంటర్నెట్, మొబైల్ టవర్ కనెక్టివిటీ విస్తరణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు, అండర్‌సీ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ స్థాపనకు పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలపై ఇరువురు చర్చించారు. మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పిస్తూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ కనెక్టివిటీ బలోపేతం కావడంతో పాటు ఐటీ, టెలికాం రంగాల్లో కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

