విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు పలు కీలక పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రముఖ కంపెనీల ప్రతినిధుల మధ్య అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) జరిగాయి.
ఏపీసీఆర్డీఏ (APCRDA), ఏపీ మారిటైమ్ బోర్డు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, పీ4 (P4) వంటి కీలక విభాగాలకు సంబంధించి మొత్తం 12 ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో వివిధ రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి, మౌలిక సదుపాయాల విస్తరణకు, కొత్త వ్యాపార అవకాశాల కల్పనకు మార్గం సుగమం కానుంది. అలాగే ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రెండు రోజులుగా కొనసాగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో వివిధ రంగాలకు చెందిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించడంతో పాటు పలు కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఓక్ ట్రీ రోడ్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భారతీయ సంస్కృతి,…
అమెరికాలో భారతీయ, యూదు సముదాయాల మధ్య ఐక్యత, ప్రేమ, శాంతి, సౌహార్దాన్ని చాటుతూ దీపావళి, హనుక్కా లైట్స్ సాంస్కృతిక వేడుకలు…
అమెరికాలోని అట్లాంటా హిందూ టెంపుల్‌లో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు…
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సామాన్యులపై ఆర్థిక భారం పెరుగుతోంది. పాలు, నెయ్యి, వెన్నతో పాటు సబ్బులు,…
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి వ్యాపార, పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టారు. ‘నమస్తే వరల్డ్’…
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం అల్లావాడ గేట్ సమీపంలో ఆర్మీకి చెందిన వాహనం అదుపుతప్పి బోల్తా…