Categories: Andhra Pradesh

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’గా నామకరణం

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీతో ముందుకొచ్చారు. విజయవాడ వేదికగా బుధవారం తన నూతన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా పార్టీ పేరుతో పాటు జెండాను కూడా ఆవిష్కరించారు. తెలుపు, కాషాయ రంగులతో పాటు ధర్మచక్రం గుర్తు ఉన్న జెండాను విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలకు, కుటుంబ ఆధిపత్య రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీని స్థాపించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేయడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ మార్పు తీసుకురావడమే తమ పార్టీ ఉద్దేశమని తెలిపారు.

పార్టీ ఆవిర్భావంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. పరివర్తన రాజనీతి పార్టీ భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ కార్యాచరణతో ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది

ManaTV Team

Recent Posts

సోనియా గాంధీ పుస్తకంపై సిక్కు సంఘాల ఆగ్రహం.. గురుద్వారా ఎదుట ప్రతుల దహనం

కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం వివాదానికి దారితీసింది. ముఖ్యంగా 1984…

2 hours ago

బాణాసంచా పొగతో కీటకాలు చనిపోయేవి.. దీపావళిపై మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు

నాగ్‌పూర్‌లో నవంబర్ 10న నిర్వహించిన మహేశ్వరి పంచాయతీ దీపావళి వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు. ఈ…

6 hours ago

శబరిమల ఆలయ ప్రవేశానికి ట్రాన్స్‌జెండర్‌కు అనుమతి నిరాకరణ.. ధ్రువీకరణ పత్రం తప్పనిసరి

తమిళనాడుకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి కోరగా, కేరళ ప్రభుత్వం అందుకు నిరాకరించింది.…

8 hours ago

అయ్యప్ప స్వామి దయవల్ల మాకు ఏమీ జరగలేదు : శేఖర్ మాస్టర్ #shekharmaster #ayyappaswamy

అయ్యప్ప స్వామి దయవల్ల మాకు ఏమీ జరగలేదు : శేఖర్ మాస్టర్ #shekharmaster #ayyappaswamy #shekharmaster #ayyappaswamy #ayyappa #sabarimala…

10 hours ago

Gold Rate Today : 24K & 22K Prices 12-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv

Gold Rate Today : 24K & 22K Prices 12-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv #goldprice…

10 hours ago

విజయసాయిరెడ్డిపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు #kap​​aul #vijayasaireddy #ysjagan #manatv

విజయసాయిరెడ్డిపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు #kap​​aul #vijayasaireddy #ysjagan #manatv ​​aul #vijayasaireddy #ysjagan #andhrapolitics #telugunews #politicalnews…

14 hours ago