Categories: Andhra Pradesh

పారిశ్రామిక రంగంలోకి మంచు మనోజ్, భూమా మౌనిక.. ఓర్వకల్లులో రూ.36.24 కోట్లతో తయారీ యూనిట్

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి వ్యాపార, పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టారు. ‘నమస్తే వరల్డ్’ అనే స్టార్టప్ కంపెనీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో భారీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో సుమారు రూ.36.24 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భారతీయ సంప్రదాయ బొమ్మలు, హస్తకళా ఉత్పత్తులను తయారు చేయనున్నారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రోత్సాహం అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. స్థానిక కళాకారులకు, చేతివృత్తుల వారికి కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

సినీ రంగంలో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డి ఇప్పుడు పారిశ్రామికవేత్తలుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు.

ManaTV Team

Recent Posts

న్యూజెర్సీలో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రామాయణం డ్యాన్స్ డ్రామా

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఓక్ ట్రీ రోడ్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

అమెరికాలో ఘనంగా దీపావళి, హనుక్కా వేడుకలు.. ఐక్యత, సౌహార్దానికి ప్రతీకగా సాంస్కృతిక సంబరాలు

అమెరికాలో భారతీయ, యూదు సముదాయాల మధ్య ఐక్యత, ప్రేమ, శాంతి, సౌహార్దాన్ని చాటుతూ దీపావళి, హనుక్కా లైట్స్ సాంస్కృతిక వేడుకలు…

3 hours ago

అట్లాంటా హిందూ ఆలయంలో నాగుల చవితి వేడుకలు.. శ్రీ నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు

అమెరికాలోని అట్లాంటా హిందూ టెంపుల్‌లో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు…

4 hours ago

సామాన్యుడికి షాక్.. పాల నుంచి నిత్యావసర వస్తువుల వరకు పెరిగిన ధరలు

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సామాన్యులపై ఆర్థిక భారం పెరుగుతోంది. పాలు, నెయ్యి, వెన్నతో పాటు సబ్బులు,…

4 hours ago

ఏపీకి రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులు.. రెండో రోజు సీఐఐ సదస్సులో 12 కీలక ఒప్పందాలు

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు పలు కీలక పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

7 hours ago

చేవెళ్లలో బోల్తాపడిన ఆర్మీ వాహనం.. 8 మంది జవాన్లకు తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం అల్లావాడ గేట్ సమీపంలో ఆర్మీకి చెందిన వాహనం అదుపుతప్పి బోల్తా…

8 hours ago