దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సామాన్యులపై ఆర్థిక భారం పెరుగుతోంది. పాలు, నెయ్యి, వెన్నతో పాటు సబ్బులు, డిటర్జెంట్లు, డ్రై ఫ్రూట్స్, పప్పుల ధరలు కూడా పెరగడంతో గృహ బడ్జెట్‌పై ప్రభావం పడుతోంది.
ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థలు అమూల్, మదర్ డెయిరీ పాల ధరలను పెంచాయి. నెయ్యి, వెన్న ధరలు కూడా అధికమయ్యాయి. దీంతో ప్రతిరోజూ పాలు, పాల ఉత్పత్తులు కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.
మరోవైపు హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ డిటర్జెంట్లతో పాటు మోతీ సబ్బు ధరలను పెంచింది. డాబర్ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. దీంతో గృహావసరాల కోసం ఖర్చు చేసే మొత్తం మరింత పెరగనుంది.
ఇక ఐటీసీ సంస్థ గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం సిగరెట్ ప్యాక్ ధరను రూ.10 పెంచింది. అటు ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రెండు నెలల వ్యవధిలో రూ.72.50 పెరిగింది.
ఇదిలా ఉంటే డ్రై ఫ్రూట్స్, కందిపప్పు, శనగల ధరలు కూడా ఎగబాకుతున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి, సామాన్య కుటుంబాలకు ఈ ధరల పెరుగుదల మరింత భారంగా మారుతోంది. నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో నెలవారీ కుటుంబ బడ్జెట్‌ను నిర్వహించడం వినియోగదారులకు సవాలుగా మారుతోంది.
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఓక్ ట్రీ రోడ్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భారతీయ సంస్కృతి,…
అమెరికాలో భారతీయ, యూదు సముదాయాల మధ్య ఐక్యత, ప్రేమ, శాంతి, సౌహార్దాన్ని చాటుతూ దీపావళి, హనుక్కా లైట్స్ సాంస్కృతిక వేడుకలు…
అమెరికాలోని అట్లాంటా హిందూ టెంపుల్‌లో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు…
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి వ్యాపార, పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టారు. ‘నమస్తే వరల్డ్’…
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు పలు కీలక పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం అల్లావాడ గేట్ సమీపంలో ఆర్మీకి చెందిన వాహనం అదుపుతప్పి బోల్తా…