తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రాజకీయ నేపథ్య చిత్రం ‘జన నాయకన్’ ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ సినిమాపై తాజాగా టాలీవుడ్ విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇటీవల దర్శకుడు హెచ్. వినోద్, ‘జన నాయకన్’ కథకు నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం కొంత ప్రేరణగా నిలిచిందని వెల్లడించారు. ముఖ్యంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఆ చిత్రం నుంచి స్ఫూర్తి పొందినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనిల్ రావిపూడి, ‘భగవంత్ కేసరి’లోని కొన్ని అంశాలు మాత్రమే ‘జన నాయకన్’లో కనిపిస్తాయి. అయితే మిగతా కథను విజయ్ ఇమేజ్‌కు అనుగుణంగా హెచ్. వినోద్ పూర్తిగా కొత్తగా రూపొందించారు’ అని అన్నారు.
అంతేకాకుండా, విజయ్ అభిమానులు ఆశించే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వినోద్ సినిమాను అత్యంత ఆకట్టుకునేలా తెరకెక్కించారని అనిల్ రావిపూడి ప్రశంసించారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ‘జన నాయకన్’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…