అమెరికాలోని తెలుగు సంఘం మన అమెరికా తెలుగు అసోసియేషన్ (MATA) విద్యార్థుల కోసం ప్రత్యేక SAT సమ్మర్ క్యాంప్ నిర్వహించనుంది. అమెరికా కళాశాలల్లో ప్రవేశాలకు కీలకమైన SAT పరీక్షలో మెరుగైన స్కోరు సాధించాలనుకునే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలో పరీక్షా విధానం, ప్రశ్నల పరిష్కార పద్ధతులు, సమయ నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ అందించనున్నారు.
ఈ క్యాంప్ ఆగస్టు 3 నుంచి 28, 2026 వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించబడుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 7:00 గంటల నుంచి 8:30 గంటల వరకు ఆన్‌లైన్‌లో తరగతులు జరుగుతాయి. మొత్తం 30 గంటల శిక్షణలో SAT మ్యాథ్స్, ఇంగ్లీష్ (రీడింగ్ & రైటింగ్) విభాగాల్లోని కీలక అంశాలను బోధించనున్నారు.
క్యాంప్ ఫీజు MATA సభ్యులకు 130 డాలర్లు, సభ్యులు కానివారికి 150 డాలర్లుగా నిర్ణయించారు. సాధారణంగా 500 డాలర్ల వరకు ఉండే ఈ కోర్సును రాయితీ ధరలో అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు పోస్టర్‌లో ఉన్న QR కోడ్ లేదా అందించిన నమోదు లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం లక్ష్మీకాంత్ గజూల (732-619-7991)ను సంప్రదించాలని సూచించారు. సీట్లు పరిమితంగా ఉన్నందున, అమెరికా కళాశాల ప్రవేశాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…