ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) నుంచి పాత పెన్షన్ విధానం (OPS)లోకి మారేందుకు అర్హులైన ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్పు కోసం ఉద్యోగులు ఒకేసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందే నియామక నోటిఫికేషన్ జారీ అయి ఉండాలి. ఆ నోటిఫికేషన్ ఆధారంగా 2004 సెప్టెంబర్ 1 లేదా ఆ తర్వాత ఉద్యోగంలో చేరి ఉండాలి. ఈ నిబంధనలకు అర్హులైన ప్రస్తుత ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు మరణించిన ఉద్యోగుల కుటుంబ పెన్షన్ లబ్ధిదారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హులైన వారు NIDHI పోర్టల్‌లోని CPS-OPS Conversion ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం నియామక నోటిఫికేషన్, సెలక్షన్ లిస్ట్, అపాయింట్‌మెంట్ ఆర్డర్, జాయినింగ్ ఆర్డర్ వంటి పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి.
దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించిన అనంతరం OPSకు మార్పుపై తుది నిర్ణయం తీసుకుంటారు. OPSకు మారిన ఉద్యోగులకు ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 వర్తిస్తాయని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ ఎమ్మెల్యేల వరుస వివాదాలు కలకలం రేపుతున్నాయి. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకోవడంపై…
ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్-2026 విజేతగా బ్రిటిష్ రచయిత ఎం. జాన్ హారిసన్ ఎంపికయ్యారు. ఆయన రచించిన 'ది ఎండ్ ఆఫ్…
రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పుష్కర్‌లో ప్రతిష్ఠాత్మకమైన వార్షిక ఒంటెలు, పశువుల జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నవంబర్ 17…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. 30కి పైగా కీలక…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్,…
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ (57) కన్నుమూశారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో…