నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక యాక్షన్ డ్రామా చిత్రం ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. సోమవారం బుక్ మై షోలో కేవలం గంట వ్యవధిలోనే 1.39 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. భారతదేశంలో ఇప్పటివరకు ఒక గంటలో నమోదైన అత్యధిక టికెట్ల విక్రయాల రికార్డు ఇదేనని తెలిపాయి.
ఈ జాబితాలో ‘రామాయణ’ తర్వాత ‘ధురంధర్-2’ గంటలో 1.09 లక్షల టికెట్ల విక్రయాలతో రెండో స్థానంలో ఉండగా, ‘పుష్ప-2’ 1.08 లక్షల టికెట్లతో మూడో స్థానంలో నిలిచింది.
దీపావళి మరుసటి రోజు కావడంతో ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవు ఉండటం కూడా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేందుకు కారణమవుతోందని తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య ‘రామాయణ’ సాధించిన ఈ టికెట్ విక్రయాల రికార్డు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ ఎమ్మెల్యేల వరుస వివాదాలు కలకలం రేపుతున్నాయి. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకోవడంపై…
ప్రతిష్ఠాత్మకమైన బుకర్ ప్రైజ్-2026 విజేతగా బ్రిటిష్ రచయిత ఎం. జాన్ హారిసన్ ఎంపికయ్యారు. ఆయన రచించిన 'ది ఎండ్ ఆఫ్…
రాజస్థాన్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పుష్కర్లో ప్రతిష్ఠాత్మకమైన వార్షిక ఒంటెలు, పశువుల జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నవంబర్ 17…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. 30కి పైగా కీలక…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్,…
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ (57) కన్నుమూశారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో…