ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతి సచివాలయంలో ప్రారంభమైంది. 30కి పైగా కీలక అజెండా అంశాలతో ఈ సమావేశం కొనసాగుతోంది.
ఈ భేటీలో రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, కీలక ప్రభుత్వ ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించనుంది. ముఖ్యంగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అంశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2026 నిర్వహణపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సదస్సుకు సుమారు 58 దేశాల నుంచి ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు హాజరుకానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 11న జరిగిన…
వెలుగుల పండుగ దీపావళి వేడుకలు లండన్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలంతా ఒక్కచోట చేరి…
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీతో ముందుకొచ్చారు. విజయవాడ వేదికగా బుధవారం తన నూతన రాజకీయ పార్టీ…
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొత్త సినిమా టైటిల్ తమిళనాడులో వివాదానికి దారితీసింది. తన 72వ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన…
ప్రొబెషనరీ డీఎస్పీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. పోలీస్ అధికారులు ఉద్యోగంలో చేరినప్పుడు ఎలాంటి…
అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకు అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…