
రెండు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అక్కడి తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలుగు కుటుంబాలు సీఎం పట్ల తమ అభిమానాన్ని చాటుకోగా, చంద్రబాబు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు.

